Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కర' ఈవెంట్‌లో అనూహ్య ఘటన.. మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని.. ధనుష్ రియాక్షన్ ఇదే!

Dhanush Reacts to Female Fan Kneeling at Kara Event
Advertisement
  • హైదరాబాద్‌లో జరిగిన 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ధనుష్‌ను చూసి మోకాళ్లపై కూర్చున్న మహిళా అభిమాని
  • అభిమానిని పైకి లేపి ఫొటో దిగిన ధనుష్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
Advertisement
ప్రముఖ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కర’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముగిశాక ఓ మహిళా అభిమాని ప్రవర్తించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ధనుష్‌ను చూసిన తీవ్ర భావోద్వేగంతో ఆమె వేదికపైనే ఆయన ముందు మోకాళ్లపై కూర్చోవడం జ‌రిగింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వేదికపై నుంచి వెళ్తుండగా, ఓ మహిళా అభిమాని అతన్ని కలిసేందుకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ధనుష్‌ను దగ్గరగా కలిసే అవకాశం దక్కించుకున్న ఆమె, ఆయన్ను చూడగానే భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఒక్కసారిగా ఆయన ముందు మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది.

ఊహించని ఈ పరిణామానికి ధనుష్ మొదట కొద్దిగా అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మళ్లీ అలాగే చేయడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి, మాట్లాడి, చివరకు ఆమెతో కలిసి ఫొటో దిగారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ‘ఫ్యాన్ గర్ల్ మూమెంట్’ అని, అభిమానానికి నిదర్శనమని చెబుతుండగా, మరికొందరు ఇలాంటి అతి ప్రవర్తన సరికాదని విమర్శిస్తున్నారు. ఈ సంఘటన తారలపై అభిమానులకు ఉండే ప్రేమ, భావోద్వేగాలను మరోసారి స్పష్టం చేసింది.
Advertisement
Advertisement
Dhanush
Dhanush movie
Kara movie
Hyderabad event
Fan girl moment
Telugu cinema
Celebrity events
Viral video
Dhanush fan
Actor Dhanush

More Telugu News